నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GDWL: జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. భీమ్ నగర్, నల్లకుంట, శ్రీనివాస కాలనీ, రెవెన్యూ కాలనీ, గంజి రోడ్డు, గవర్నమెంట్ ఆసుపత్రి ఏరియా తదితర ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.