జిల్లాలో అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్

కడప జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనాల పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లు, బంగారు దుకాణాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడ్డారని, మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో అధికంగా చోరీలు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు అరకేజి బంగారు, 10 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.