వైకల్యాన్ని అధిగమించి.. విజయం సాధించి
NLG: 27వ జాతీయ సీనియర్ క్రీడల ఛాంపియన్‌షిప్ (చెవిటి)లో పతకాలు సాధించి జిల్లా కీర్తిని చాటిన క్రీడాకారులను కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వైకల్యాన్ని సైతం అధిగమించి, పట్టుదలతో క్రీడల్లో రాణించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఈ క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.