334 అర్జీలు స్వీకరణ… గడువులోపు పరిష్కారానికి ఆదేశాలు

334 అర్జీలు స్వీకరణ… గడువులోపు పరిష్కారానికి ఆదేశాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి 334 అర్జీలు స్వీకరించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతతో గడువులోపు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లాకళ్యాణి సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.