VIDEO: ఏళ్లు గడిచినా ఉప్పల్లో మారని వైనం..!
MDCL: ఉప్పల్ పరిధి కావేరి నగర్, చిలుకా నగర్, నాచారం ప్రధాన రోడ్ల పై ఏళ్లుగా శానిటేషన్ పరిస్థితి దారుణంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా చెత్త డంపింగ్ జరుగుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దుర్వాసన, దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టాలి.