ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కమిషనర్
VKB: వికారాబాద్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని (GGH) కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలను ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం వైద్యులతో సమావేశమై మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సూపరింటెండెంట్ డా. రాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఐ డా. స్వర్ణ కుమారి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.