ఈ నెల 4 న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
WNP: మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని విశ్వక్ సేన గోశాలలో డిసెంబర్ 4 వేంకటేశ్వర స్వామివారి 20వ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 10 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ ఉంటుందని గోశాల వ్యవస్థాపకులు సౌమిత్రి రామాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.