విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ప్రకాశం: దర్శి మండలం సందువారిపాలెంలో సోమవారం నారాయణ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను తాకడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు