ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు ఎమ్మెల్యే వంశీకృష్ణ

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రజల సౌకర్యార్థం అచ్చంపేట నుండి లింగాలకు వయా నర్సాపల్లి సురాపూర్ గ్రామాల మీదుగా మంగళవారం జెండా ఊపి ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని గుర్తు చేశారు.