'రైతులకు సరిపడినంత యూరియా పంపిణీ చేయాలి'

'రైతులకు సరిపడినంత యూరియా పంపిణీ చేయాలి'

GNTR: తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం నాయకులు శుక్రవారం పర్యటించారు. తేలప్రోలు, కంచర్లపాలెం గ్రామాల్లో పర్యటించిన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివ సాంబిరెడ్డి ఇటీవల వర్షాలు వల్ల దెబ్బతిన్న పైరును పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని పెట్టుబడి మొత్తం రైతులు నష్టపోయారన్నారు.