గత 11 ఏళ్ల పాలనలో బీసీలను పట్టించుకోలేదు
BHPL: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ ఆరోపించారు. కులగణన అనంతరం మాత్రమే డీలిమిటేషన్ చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గత 11 ఏళ్ల పాలనలో బీసీలను పట్టించుకోలేదని కేంద్రంపై విమర్శలు చేశారు.