ఆర్వోబీ నిర్మించాలని కార్పొరేటర్ వినతి

ఆర్వోబీ నిర్మించాలని కార్పొరేటర్ వినతి

WGL: చింతల్ బ్రిడ్జి నుంచి పుప్పాల గుట్ట, ఖిలావరంగల్ పెట్రోల్ పంప్ వరకు ఆర్వోబీ (ROB) నిర్మించాలని 35వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్ సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణికి వినతి పత్రం అందించారు. ఈ మార్గంలో పెద్ద పెద్ద లారీలు వెళ్లడంతో రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.