'వ్యక్తిత్వ వికాసంపై కళాజాత ప్రదర్శన'
ADB: సిరికొండ MPUPS పాఠశాలలో తెలంగాణ సాంస్కృతిక జిల్లా కళాబృందం సారథి ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు బుధవారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా డ్రగ్స్ నిర్మూలన, వ్యక్తిగత పరిశుభ్రత, విద్య ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.