వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
GNTR: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని పోస్టాఫీస్ బజారులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన వరికుటి ధనుష్‌పై బుధవారం వీధి కుక్కలు వెంబడించి దాడి చేశాయి. ఈ దాడిలో ధనుష్‌కు 15 చోట్ల గాయాలయ్యాయి. బాధితుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గ్రామంలో వీధి కుక్కలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.