చెలరేగుతున్న ఇసుక మాఫియా ?
భూపాలపల్లి: మహాదేవపూర్ మండలంలో ఇసుక మాఫియా చెలరేగుతోంది. ప్రభుత్వం అనుమతించిన పరిమితికి మించి గోదావరి నుంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తున్నారు. లోడింగ్ ఛార్జీల పేరుతో కాంట్రాక్టర్లు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. డబ్బులు ఇస్తేనే లోడింగ్ చేస్తాం, లేదంటే లారీని వెనక్కి పంపిస్తాం అంటూ డ్రైవర్లకు హుకుం జారీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.