కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే చిట్ చాట్..

NLR: కావలి పట్టణం రూపాయి మిద్ది సెంటర్‌లోని టీ పాయింట్ వద్ద మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో టీ తాగుతూ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని నేతలకు ఆయన సూచించారు.