సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
SS: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఏడు వరాలకు కృతజ్ఞతగా సత్యసాయి జిల్లా వికలాంగుల సంఘం నాయకులు పుట్టపర్తిలో పాలాభిషేకం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ రుణాలు వంటి వరాలు ప్రకటించినందుకు దివ్యాంగులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.