రేపు హైదరాబాద్‌కు జగన్

రేపు హైదరాబాద్‌కు జగన్

TG: ఏపీ మాజీ సీఎం జగన్‌ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా, నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉదయం 11:30 గంటలకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం ఆదేశాల మేరకు దాదాపు ఆరేళ్ల తర్వాత జగన్ ఈ విచారణకు హాజరవుతున్నారు.