నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

KMM: కామేపల్లి మండలంలోని కొత్తలింగాల విద్యుత్ సబ్ స్టేషన్‌లో బుధవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక (CGRF) సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని సభ్యులు మంధనపు రామారావు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులు, రైతులు తమ సమస్యలను నేరుగా ఫోరం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.