మొబైల్ ఫోన్లు ఇచ్చేసిన అంగన్వాడీ సిబ్బంది

SKLM: టెక్కలి, నందిగం మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం అధికారులు తమకిచ్చిన మొబైల్ ఫోన్లను టెక్కలి ప్రాజెక్ట్ కార్యాలయంలో పెట్టేసారు. కేంద్రాల నిర్వహణకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేవకపోవడంతో ఎఫ్ఆర్ఎస్, ఫోటో క్యాప్చర్, నెట్ వర్క్ సమస్యలు నెలకొనడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు టెక్కలి ప్రాజెక్ట్ సిబ్బంది మొబైల్ ఫోన్లను ఇచ్చేసారు.