'మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది'
SRCL: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, అలాగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో ప్రజల ఆరోగ్యంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాయామం వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల శుభ్రత పాటిస్తూ ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.