బల్దియాలో ముగిసిన ప్రత్యేక పాలన
నిర్మల్ మున్సిపాలిటీలో దాదాపు ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. గత పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 27, 2025 నుంచి ప్రత్యేక పాలన కొనసాగగా స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ వ్యవహరించారు. సోమవారం నూతన పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టడంతో ప్రత్యేక పాలన ముగిసింది.