'12 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్&వర్కర్స్ యూనియన్ మండల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి వెంకటయ్య హాజరై మాట్లాడారు. ఈనెల 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి అన్యాయం చేసిందన్నారు.