VIDEO: హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శోభాయాత్ర
SDPT: బెజ్జంకిలో శ్రీ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ ప్రతిమను అలంకరించిన ప్రత్యేక వాహనంపై ప్రతిష్టించి గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. ప్రతి ఏడాది శ్రీరామ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.