అమృత్ చెరువుల పరిశీలన
GNTR: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అమృత్ పథకం కింద అభివృద్ధి చేయనున్న 7 చెరువులను కమిషనర్ అలీమ్ బాషా పరిశీలించారు. కాజా, చినకాకాని, నూతక్కి తదితర ప్రాంతాల్లోని చెరువులను బుధవారం అధికారులతో కలిసి సందర్శించారు. వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనంతో వీటిని సుందరీకరించాలని సూచించారు. పర్యావరణం కాపాడుతూ, ప్రజలకు ఆహ్లాదం పంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.