'జీవో నంబర్ 77ను రద్దు చేయాలని వినతి'

నంద్యాల: జీవో నంబర్ 77ను రద్దు చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం జీవో నంబర్ 77ను తీసుకువచ్చి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ లేకుండా చేసిందని ఆరోపించారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు.