ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని శివ నగర్ కాలనీలో గల MPUP స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్య తీరును తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. 'ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు' అంటూ నినాదాలు చేశారు.