ఇండియన్ పోర్ట్స్ -2025 బిల్లును స్వాగతిస్తున్నాం: ఎంపీ

KMM: కేంద్ర మంత్రి సర్భానంద సొనోవాల్ ప్రవేశపెట్టిన ఇండియన్ పోర్ట్స్- 2025 బిల్లును స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఈ కొత్త బిల్లు ఆధునికత వైపు తీసుకువెళ్లే దూరదృష్టితో కూడిందిగా భావిస్తున్నామని చెప్పారు. ఇది తీర రాష్ట్రాలు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే వీలు కల్పిస్తూ ఆర్థికాభివృద్ధి మరింత దోహదపడగలదని పేర్కొన్నారు.