ఉత్తమ ఉపాధ్యాయుడిగా సంతోష్ కుమార్ ఎంపిక

ఉత్తమ ఉపాధ్యాయుడిగా సంతోష్ కుమార్ ఎంపిక

PDPL: రామగుండం మండలం ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్‌ శుక్రవారం గాంధీ పార్కు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మండల ఎంఈఓ మల్లేశం చేతుల మీదుగా సాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఆయన విద్యా రంగంలో చేసిన సేవలకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, ఇతర ఉపాధ్యాయులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు.