జైపూర్లో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

ADB: ఎన్నికల హామీకి కట్టుబడి రైతు రుణ మాఫీ చేయాలని గురువారం ప్రజాభవన్ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాత్రి నుంచే హైదారాబాద్ వెళ్లకుండా నాయకులు దూట రాజ శేఖర్, బడుగు రవి, బొంగోని జగన్ గౌడ్, దూట రాజ్ కుమార్, గోదారి స్వామిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.