INSPIRATION: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

INSPIRATION: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా కర్మనా నమ్మి, ఆచరించిన వ్యక్తి.