సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌పై విజయ్ UPDATE

సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌పై విజయ్ UPDATE

విజయ్ సేతుపతి 'మహారాజా' మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై విజయ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశారని, త్వరలోనే నరేషన్ వినబోతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్ పట్ల తాను చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నానని చెప్పడంతో, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.