ఇసుక స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇసుక స్వాధీనం చేసుకున్న పోలీసులు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక రెండవ ఎస్సై నరేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక టీచర్స్ కాలనీ సమీపంలోని ఒక వెంచర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, , సుమారు 5 ట్రిప్పులు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.