ఇచ్చాపురం అసలు పేరు 'స్వేచ్ఛాపురం'
SKLM: 'ఇచ్ఛాపురం' ఒడిశా సరిహద్దుల్లో ఉన్న చివరి పట్టణం. దీన్ని ఏపీకు ముఖద్వారం అని కూడా అంటారు. ఈ పేరు స్థానిక దేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు నుంచి వచ్చిందని స్థానికుల నమ్మకం. "స్వేచ్ఛ" అంటే స్వయంగా కోరుకోవడం(ఇచ్ఛాపూర్తి) అని అర్థం. ఇక్కడ ప్రార్థన చేస్తే ఇచ్ఛలు(కోరికలు) తీరతాయని నమ్ముతారు. "స్వేచ్ఛాపురం" కాలక్రమేణా ఇచ్ఛాపురంగా మారిందని స్థానికులు చెప్పుకుంటారు.