మధు మృతికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు నివాళి

మధు మృతికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు నివాళి

NLG: మిర్యాలగూడ 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన పేరం మధు అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఇందిరమ్మ కాలనీలో వారి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకుంటానని ఆయన భరోసానిచ్చారు.