అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
WNP: ఆత్మకూరు పట్టణంలో శనివారం అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు 101కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది రహమత్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.