ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 10 వినతులు
మన్యం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సానుభూతితో పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు 10 వినతులు వచ్చినట్లు తెలిపారు.