నేడు అందుబాటులో పన్ను చెల్లింపు కౌంటర్లు

నేడు అందుబాటులో పన్ను చెల్లింపు కౌంటర్లు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్ను చెల్లింపుదారులు సౌలభ్యం కోసం ఆదివారం కూడా నగదు కౌంటర్లు తెరిచే ఉంటాయని కమిషనర్ మయూర్ ఆశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయని పేర్కొన్నారు. అలాగే, శనివారం ఒక్కరోజే రూ.2.75 కోట్ల పన్ను ఆదాయం వచ్చినట్లు వివరించారు.