కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతుల నిరసన
KMM: బోనకల్ మండలం ముష్టికుంట్లలో మొక్కజొన్న రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు ధర్నాకు దిగినట్లు వెల్లడించారు. ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి చేతిలో మొక్కజొన్న కంకులు పట్టుకుని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతుల గోడు ఎప్పటికీ అర్థమవుతుందని అన్నారు.