VIDEO: కేంద్ర ప్రభుత్వం జలశక్తి అవార్డుకు ఎంపికైన ఆరేపల్లి
HNK: ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో మిషన్ భగీరథ రక్షిత మంచినీటి సరఫరా పథకంలో ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం నేడుజలశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. ఈ గ్రామంలో వంద శాతం స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల హర్ ఘర్ జల్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పోతరబోయిన స్రవంతి, గ్రామ ప్రజాప్రతినిధులకు రాష్ట్ర స్థాయి పురస్కారం అందించారు.