వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.