'CJI బి.ఆర్. గవాయ్ పై దాడి సరికాదు'
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సమావేశంలో CPI నేత కుమారస్వామి మాట్లాడుతూ.. భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసులు విచారణ జరుగుతున్న సమయంలో దాడి చేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.