నార్నూర్ గ్రామపంచాయతీకి అరుదైన గుర్తింపు
ADB: నార్నూర్ గ్రామపంచాయతీకి బాల్య వివాహ రహిత (చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ) పంచాయతీగా అధికారిక గుర్తింపు లభించింది. గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాల సత్ఫలితమే ఈ అవార్డు అని పంచాయతీ కార్యదర్శి మోతిరం తెలిపారు. గ్రామపంచాయతీకి ఈ గుర్తింపు దక్కినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.