పాటిమీద గ్రామంలో కొత్త బోరు ప్రారంభం..!
AKP: నక్కపల్లి మండలం అమలాపురం పంచాయతీ పాటిమీద గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ శంకర్రావు పంచాయతీ నిధులతో సుమారు రూ.2 లక్షల వ్యయంతో కొత్త బోరును ఏర్పాటు చేసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.