VIDEO: మందుబాబు వీరంగం – ఆర్టీసీ బస్సుపై దాడి

VIDEO: మందుబాబు వీరంగం – ఆర్టీసీ బస్సుపై దాడి

WGL: ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ సమీపంలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడ నుంచి నర్సంపేటకు వెళ్తున్న బస్సును అడ్డుకుని డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేశారు.