'నానో యూరియా వైపు మొగ్గు చూపాలి'

MDK: నానో యూరియా వాడకం వైపు రైతులు మొగ్గు చూపాలని చేగుంట ఏవో హరి ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో రైతు సిద్ధిరాములు క్షేత్రంలో నానో యూరియా డెమో నిర్వహించారు. రసాయన ఎరువులకు దీటుగా నానో యూరియాతో ప్రయోజనాలు ఉన్నాయని హరిప్రసాద్ తెలిపారు.