మెట్రో పిల్లర్లపై వెలసిన నిరసన పోస్టర్లు
HYD: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ నగరంలో మెట్రో పిల్లర్లు వినూత్న నిరసనకు వేదికయ్యాయి. తమ జీవనోపాధిని కాపాడాలంటూ తెలంగాణ ఔట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్(TOMO) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 'హోర్డింగ్స్' ద్వారానే విజ్ఞప్తి చేసింది. మెట్రో పిల్లర్లపై వెలిసిన ఈ హోర్డింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు.. సీఎం గారు సేవ్ 'హోర్డింగ్' అని ఉన్న ఫొటోను ముద్రించారు.