నల్గొండలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

NLG: వన్ టౌన్ పట్టణ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ కొలను శివరాంరెడ్డి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ప్రకాశం బజార్, దేవరకొండ రోడ్లో ఆంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ సహాయంతో అనుమానస్పద ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాన్ షాప్, లాడ్జిలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో డాగ్ సహాయంతో తనిఖీలు జరిపారు.