'అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి'

'అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి'

ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. దీర్ఘకాలిక సన్నద్ధతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ వెల్లడించారు. అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమన్వయం పాటించాలని, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.