వీధి కుక్కల స్వైర విహారం

JGL: పట్టణంలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పిల్లలు, మూగజీవాలపై దాడికి తెగబడుతూ.. కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించలని కోరుతున్నారు.